Monday, October 5, 2020

షరా మామూలే!

 మంచు తెరలు తొలగి వసంతం వచ్చేస్తుందనుకున్నాం అంతా

ఋతువులే కదా ఎక్కడికి పోతాయ్ ఒకదాని తర్వాత ఒకటి రావల్సిందే అనుకున్నాం అంతా

సాఫీగా సాగుతుందనుకుంటున్న సాగరయానం లోకి

తుఫాను ఒక ప్రళయం సృష్టించి 

నానా అవస్థలు పడుతున్న మన ఆర్ధిక వ్యవస్థలు

నన్ను చూడు నాజూకు చూడు అన్న మన జీవన శైలుల నడ్డివిరగ్గోట్టి

మనం అభివృద్ధి అనుకున్న మన మేని పొడుగు ప్రొద్దుపోయే వేళ మన నీడ మత్రమే అని సర్వ-అజ్ఞానులమైన మనకింకా తెలియరాలేదు

లేనిపోని ఆశలు కల్పించుకుని ఇప్పటికీ

ఇవాళ్టికి సద్దె దొరికితే చాలు అని సగటు దిగువ మధ్యతరగతి జీవులం బ్రతుకులు వెళ్ళదీసేస్తున్నాం 

మనకేంటి లోటు మనకి వచ్చేముందు మన జనాల్ని దాటుకుని రావలనుకున్న మండూకరేడులకు ఇప్పటికైనా అర్ధమయిందనుకుంటే 

మనం అమ్మకున్న ఓట్లతో గెలిచిన వాళ్ళు మన మీద అంత జాలిచూపిస్తారా?

షరా మామూలే! షరా మామూలే!! అనుకునే లోపు మళ్ళీ శీతాకాలం తారసపడేసింది  చలి కుంపట్లు తీయండహో!!!

Friday, September 25, 2020

 విశ్వంబు విషమ్ము చిమ్మెన్

అసురుల పలుచనజేయు

కౄరమానవుని మట్టుబెట్టగ

యదినా గురుతుల్యులను కబళించెనే విధీ

RIP NV Sharma Sir, Vangapandu, SPB

Monday, September 16, 2019

స్మృత్యాంజలి

వినువీధినదివ్వెలను వెలిగించెడివాడి నెవ్వడెరుగు
నడివీధిన మిణుగురుల మిణుకులనేరి
వెలుతురులద్ది అవ్విజయగర్వంబునేలిన
వల్లభుండు మీరు ఆచార్యా మీస్మృతి నిమరువజాలము 

Sunday, September 15, 2019

దోమా కుట్టాకే నన్ను

దోమా కుట్టాకే నన్ను
మా డాక్టరయ్య సూదిమందేస్తడు
జర్రంత సుర్రుమనించిండు
మా అయ్య ఆస్తులన్ని కాజేసిండు

దోమా కుట్టాకే నన్ను
మా దొరబాబు గుస్స జేస్తడు
పదారువేల పధకాలు పెట్టిండంట
పనులన్నీ వాటంతట అవే అయితయంట

దోమా కుట్టాకే నన్ను
ఇల్లు మొత్తం సాఫ్ జేస్తా
మా అయ్య జాగీర్లు కదా రోడ్లన్నీ గలీజ్ జేస్తా
నా పని మాత్రం నేను జెయ్య పక్కొడి మీద పడి ఎడుస్తా

దోమా కుట్టాకే నన్ను
ఏం జేషినా సిగ్గైతె మాకు రాదు
ఇజ్జత్ గసొంటివి తెల్లోల్లు తోల్కబొయిండ్రు
మమ్మల్ని కుడితే నువ్వు కూడా మా లాగైతవ్ కుట్టే ముందు జర సోంచాయించుకో

Sunday, August 25, 2019

మొట్టికాయ్!

varnanaateetam.blogspot.com
మొట్టికాయ్
__
సరుగుడు అరుగుల నడుమన
విరివిగ తిరుగుడు సరసమనుచు ఖర గురువుగ
హితవులు బలికిన గణముల
నధముడు గుణముల అణకుడు మరియొక మోటిగిడి

For poetry enthusiasts:
ఇది అన్నీ ' నల ' గణాల తో కూర్చబడిన కందం.
ఆధముడు, అణకుడు, మోటిగిడి అన్నీ పర్యాయపదాలే

Wednesday, August 21, 2019

మరకత ధవళ మీమాంస

మరకత ధవళ మీమాంస!
పదేళ్లప్పుడు మొదలయ్యిందేమో పరుగు...
ఏడన్నారు పదన్నారు
పదిహేడేళ్లనగానే సర్కారీ కొలువన్నారు
చాకలిపద్దులు వల్ల కాలేదు చదువనుకున్నాను
చదివాడనిపించుకున్నాను పంకాలు కాదు పుంఖాలు కాదు
శీతల గదుల్లో దివిటీల వెలుగనుకున్నాను
వెలుతురే తప్ప చీకటే లేదనుకున్నాను
పరుగు కాస్తా ఎగురయ్యిందా తెలీనేలేదు
ఇరవై ఎప్పుడు రెండింతలు అయ్యిందో
రెక్కల్లో బలం సడలుతుందో రెప్పల్లో కునుకు రాకుందో
దారిన పడ్డానా దారి తప్పానా
కనిపించేది సేదతీరే తీరమేనా
మానవ ప్రలోభాలనూరించే మరో ఎండమావా

Thursday, August 15, 2019

లోకం పోకళ్శు

వివరము జెప్పెడి వారులు
వందల్వేలును గాదు కోకొల్లల్కాగ
అర్ధమ్మే వ్యర్ధమ్మైనదాని
వలువలు విడిచిన విలువలు దేనికి శుంఠా!